Swag: శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘శ్వాగ్’. ఈ నెల 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాను థియేటర్ ఆడియన్స్ పట్టించుకోలేదు. దాంతో అలా వెళ్ళిన బాక్సులు ఇలా తిరిగి వచ్చేశాయి. థియేట్రికల్ రన్ విషయంలో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ కి ముందు శ్రీవిష్ణు చూశాయగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన వ్యగ్యంగా ‘TFI ఫెయిల్డ్ హియర్’ బ్యాచ్ సినిమా చూడాలని కోరాడు. అయితే ఆయన మాటను ఆ బ్యాచ్ తో పాటు ప్రేక్షకులు కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఓటీటీలో గట్టిగా నిలబడింది ‘శ్వాగ్’. చాలా మంచి సినిమాలు ఇలా రిలీజ్ టైమ్ లో ఆకట్టుకోలేక పోయినా ఆ తర్వాత ‘TFI ఫెయిల్డ్ హియర్’ చేరిపోతుంటాయి. ఇప్పుడు ఆ క్లబ్ ఎంట్రీ ఇచ్చింది ‘శ్వాగ్’. ఈ తరహా సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాతే ఆదరణను చూరగొంటాయి. ‘శ్వాగ్’ సినిమాను హర్షిత్ గోలి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించింది. ఇందులో శ్రీవిష్ణు భిన్న పాత్రలలో కనపించాడు. ప్రత్యేకించి ట్రాన్స్ జెండర్ గా తను చేసిన పాత్ర ఆడియన్స్ మెప్పు పొందుతోంది. దాంతో నెటిజన్స్ ‘TFI ఫెయిల్డ్ హియర్’ అనే హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తున్నారు.
