Swachh Andhra: రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దీవాస్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కర్నూల్ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని సి క్యాంప్ సెంటర్ దగ్గర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని కమిషనర్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల మూడవ శనివారం ఒక థీమ్ తో స్వచ్చాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రవీంద్ర బాబు తెలిపారు. ఈ నెలలో “న్యూ ఇయర్ – క్లీన్ స్టార్ట్” అన్న థీమ్ తో స్వచ్చాంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని క్లీన్ గా ఉంచేందుకు మహిళలు కూడా తమ వంతుగా కృషి చేస్తారని తెలిపారు.