Suresh Babu

Suresh Babu: తండ్రికి తగ్గ తనయుడు… సురేశ్ బాబు

Suresh Babu: తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు. తండ్రి డి.రామానాయుడు చూపిన బాటలోనే చిత్ర నిర్మాణంలో తనదైన బాణీ పలికించారు సురేశ్ బాబు. తన తమ్ముడు వెంకటేశ్ ను స్టార్ హీరోగా నిలపడంలో సురేశ్ బాబు కృషి ఎనలేనిది. ట్రెండ్ కు తగ్గ కథలను ఎంపిక చేసుకుంటూ, తగిన సంగీతసాహిత్యాలను మేళవించి చిత్రాలను నిర్మించారు సురేశ్ బాబు.

ఇది కూడా చదవండి: E Sala cup namde: ఈ సాలా కప్ నామ్దే అంటున్న అభిమానులు! మరి ఈ జట్టు తో సాధ్యమేనా

Suresh Babu: ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రాలకు రామానాయుడు చిత్రసమర్పకునిగానే దర్శనమిచ్చారు. అన్నదమ్ములు సురేశ్, వెంకటేశ్ కాంబోలో రూపొందిన అనేక చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. ఇక తెలుగు చిత్రసీమ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తూ సాగుతున్నారు సురేశ్ బాబు. ప్రస్తుతం మునుపటి స్పీడు చూపించక పోయినా, ఇప్పటికీ నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటూనే ఉన్నారు సురేశ్ బాబు. డిసెంబర్ 24న సురేశ్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నిర్మించిన చిత్రాలు బుల్లితెరపై ప్రేక్షకులను పలకరిస్తాయని చెప్పవచ్చు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *