Supreme Court Of India:

Supreme Court Of India: ముంబై మ‌హిళ‌ భ‌ర‌ణం కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు!

Supreme Court Of India:ముంబై మ‌హిళ భ‌ర‌ణం విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కూ భ‌ర‌ణం విష‌యంలో భ‌ర్త‌దే బాధ్య‌త అంటూ కోర్టులు తీర్పునిచ్చాయి. తాజాగా ప‌నిచేసే విలుంటే భార్య‌లు అంత‌గా భ‌ర‌ణం ఎందుకు కోరాలి అంటూ తీర్పు వెలువ‌రించింది. గ‌తంలోనే ఈ కేసు విష‌యంలో విచారించిన సుప్రీం ధ‌ర్మాసం తీర్పును వాయిదా వేసి, ఈ రోజు (ఆగ‌స్టు 6) తీర్పును ఇచ్చింది.

Supreme Court Of India:పెళ్లయిన 18 నెల‌ల‌కే ముంబైకి చెందిన ఓ మ‌హిళ విడాకుల కోసం కోర్టుకెక్కింది. హైకోర్టు నుంచి కేసు సుప్రీంకోర్టు దాకా చేరింది. త‌న‌కు భ‌ర‌ణం కింద రూ.12 కోట్ల‌తోపాటు ముంబై న‌గ‌రంలో ల‌గ్జ‌రీ ఫ్లాట్‌ను ఇప్పించాల‌ని కోరుతూ కోర్టును ఆశ్ర‌యించింది. ఈ కేసుపై విచారించిన ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించింది.

Supreme Court Of India:ప‌నిచేసే విలున్న మ‌హిళ‌లు విడాకుల త‌ర్వాత భ‌ర్త నుంచి భ‌ర‌ణం కోసం పాకులాడొద్ద‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తీర్పునిచ్చింది. మ‌హిళ ఉన్న‌త విద్య చ‌దివింద‌ని తెలుసుకొని.. మీరెందుకు ఉద్యోగం చేయ‌రు? అని ప్ర‌శ్నించింది. ఇత‌రుల‌పై ఆధార‌పడకుండా హుందాగా జీవించ‌వ‌చ్చు క‌దా అని సుప్రీంకోర్టు ఆ మ‌హిళ‌ను ప్ర‌శ్నించింది. భ‌ర‌ణం కింద ఫ్లాట్ మాత్ర‌మే వ‌స్తుంద‌ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రూ.12 కోట్ల భ‌ర‌ణం ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *