Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం ‘ఫ్యామిలీ వారం’ నడుస్తుండడంతో, ఇంట్లో భావోద్వేగాలు, ఆనంద క్షణాలతో పాటు గెలుపు వ్యూహాలపై చర్చలు కూడా ఊపందుకున్నాయి. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ప్రముఖంగా కనిపించిన అంశం సుమన్ శెట్టి మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఆయన భార్య లాస్య హౌస్‌లోకి ప్రత్యేక ఎంట్రీ ఇవ్వడం.
సుమన్ – లాస్య ఎమోషనల్ మూమెంట్
తన మ్యారేజ్ యానివర్సరీ రోజున భార్య లాస్యను చూసిన సుమన్ శెట్టి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇద్దరూ హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకోవడం, క్యూట్ మూమెంట్స్ పంచుకోవడం హౌస్‌మేట్స్‌ను కూడా భావోద్వేగానికి గురిచేసింది. కొడుకు గౌతమ్,ఇంకా కూతురి గురించి అడిగి తెలుసుకున్న సుమన్, భార్య వచ్చిన ఆనందంలో పూర్తిగా ఫుల్ ఎనర్జీతో కనిపించారు.
భర్త గేమ్‌ను నిజాయితీగా ఆడుతున్నాడని లాస్య ప్రశంసించినప్పటికీ, ఒక ముఖ్యమైన వ్యూహాత్మక సలహా ఇచ్చింది. మీరు తనూజకు కొంచెం దూరంగా ఉండాలి. ఆమెతో ఎక్కువగా ఉంటే, హైప్ ఆమెకే వెళుతుంది. ఆమె ఎక్కువగా హైప్ అవుతున్న వారిని మంచి చేసుకుంటుంది. అందుకే గేమ్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని లాస్య సుమన్‌కు సూచించింది.
ఇది కూడా చదవండి: Babar Azam: 907 రోజుల తర్వాత సెంచరీ.. ఫీజులో 10 శాతం జరిమానా విధించినట్లు ఐసిసి
తాను ఎందుకు నెగిటివ్ అవుతున్నానని అమాయకంగా అడిగిన సుమన్‌కు ఈ సలహా షాక్‌గా అనిపించింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై స్పందిస్తూ, “వదిన మాట విను, కప్పు కొడతావ్” అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. తనూజపై ఇప్పటికే వస్తున్న ‘బిగ్ బాస్ దత్తపుత్రిక’ ట్రోల్స్‌కు ఈ సలహా మరింత బలం చేకూర్చింది.
తనూజ కుటుంబ సభ్యుల రాక
సుమన్ తర్వాత, తనూజ కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ప్రవేశించారు. అక్క కూతురు శ్రేష్ట, చెల్లి పూజా రావడంతో తనూజ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న చెల్లి పూజా, తనూజకి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే, ప్రతి విషయం మీద ఏడవద్దు, అమ్మ కూడా బాధపడుతోంది, అని పూజా చెప్పడంతో తనూజ భావోద్వేగానికి గురైంది. అనంతరం, తనూజ తన చెల్లిని పెళ్లికూతురిలా రెడీ చేసి, బొట్టుపెట్టి, గాజులు వేయడం హౌస్‌లో ఎమోషనల్ వాతావరణాన్ని సృష్టించింది.
రీతూ-డీమాన్ గ్యాప్‌పై స్ట్రాటజీ చర్చ
మరోవైపు, నామినేషన్ల నేపథ్యంలో హౌస్‌లో రీతూ చౌదరీ మరియు డీమాన్ పవన్ మధ్య వచ్చిన గ్యాప్‌పై చర్చలు జరిగాయి. దివ్య మాట్లాడుతూ, రీతూ తనని నామినేట్ చేస్తోందని, ఆమెది ‘చెస్ ఆడుతున్నట్టుగా’ ఉండే గేమ్‌ప్లే అని వ్యాఖ్యానించింది. తనూజ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, రీతూ సొంతంగా కాకుండా, కేవలం డీమాన్ కోసం గేమ్ ఆడుతుందని చెప్పడం గేమ్‌లో కొత్త టెన్షన్‌ను సృష్టించింది.
మొత్తంగా, ఫ్యామిలీ వారం కావడంతో ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, నవ్వులు, అలాగే గెలుపు కోసం హౌస్‌మేట్స్ మధ్య జరుగుతున్న స్ట్రాటజీ డిస్కషన్స్‌తో నిండిపోయింది. ఇక బుధవారం ఎపిసోడ్‌లో డీమాన్ పవన్ అమ్మ ఎంట్రీ ఉండడంతో మరింత ఎమోషనల్ సన్నివేశాలు ఉండే అవకాశం ఉంది.
