Sujana Chowdary:

Sujana Chowdary: లండ‌న్‌లో బీజేపీ ఎమ్మెల్యేకు తీవ్ర‌గాయాలు

Sujana Chowdary: లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేకు తీవ్ర‌గాయాలైన సంఘ‌ట‌న బ‌య‌ట‌కొచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి ఇటీవ‌లే లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. సుజ‌నా చౌద‌రి అక్క‌డి ఓ సూప‌ర్‌మార్కెట్‌కు వెళ్లిన సంద‌ర్భంగా జారిపడ్డారు. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న కుడి భుజం ఎముక విరిగి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

Sujana Chowdary: స‌ర్జ‌రీ చేయాల‌ని వైద్యులు సూచించ‌డంతో సుజ‌నా చౌద‌రి మే 6న తెల్ల‌వారుజామున‌ హుటాహుటిన హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌చ్చారు. ఇక్క‌డి ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో స‌ర్జరీ కోసం అడ్మిట్ అయిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌దని వైద్యులు తెలిపారు. సుజ‌నా చౌద‌రికి తీవ్ర‌గాయాలు కావ‌డంతో బీజేపీ నేత‌లు, ఏపీ కూట‌మి కీల‌క నేత‌లు ఆరా తీసిన‌ట్టు స‌మాచారం.

Sujana Chowdary: మే నెల 2న సుజ‌నా చౌద‌రి విజ‌య‌వాడ‌లోనే ఉండ‌గా, ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌లో కూడా ఆయ‌న హాజ‌ర‌య్యారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో ప్ర‌ధాని మోదీకి స్వాగ‌తం కూడా ప‌లికారు. ఆ త‌ర్వాత ఆయ‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌గా, ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *