Suicide: అమ్మానాన్న చాటున పెరిగిన ఆడకూతురు.. ఎన్నో ఆశలతో అత్తగారింటిలో అడుగు పెట్టింది.. అభం శుభం తెలియని ఆ నవవధువు తనకు తెలిసిన బంధువులతో మాట్లాడింది.. మొహమాటానికి వారిచ్చిన కూల్‌డ్రింగ్ తాగింది.. అదే ఆమె తప్పయింది.. ఆమె మాట్లాడిన బంధువులు ఆమె భర్తకు పడనివారట. ఆ విషయం తెలిసో, తెలియకో వారితో మాట్లాడింది. భర్త వేధింపులతో నిత్యం నరకం అనుభవించింది. తాను కోరుకున్న కలలు ఇవి కాదని.. తన జీవితం వ్యర్థమనుకుని పెళ్లయిన రెండు నెలలకే తనువు చాలించింది.
Suicide: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సాలె బంజర గ్రామంలో మాలోతు శ్రీను, నాగమణి దంపతుల ఒక్కగానొక్క కూతురు పూజిత (19)ను ఇంటి సమీపంలోని జాటోతు శ్రీనివాస్‌కు ఇచ్చి గత ఏప్రిల్ 16న వివాహం చేశారు. శ్రీనివాస్ హైదరాబాద్ కేపీహెచ్‌బీలో నివాసముంటూ జువెలరీ షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
Suicide: కొన్నాళ్ల క్రితం భార్యాభర్తలు ఊళ్లో సమయంలో పూజిత తెలిసిన బంధువులతో కలిసి కూల్ డ్రింగ్ తాగింది. ఈ విషయాన్ని ఆమె భర్త శ్రీనివాస్ అన్న, అల్లుడు కలిసి వీడియో తీశారు. ఆ ఫొటోను శ్రీనివాస్‌కు పంపారు. ఆ విషయంపై తనకు పడనివారితో కూల్‌డ్రింక్ ఎందుకు తాగావని పూజితను శ్రీనివాస్ వేధించసాగాడు.
Suicide: ఆనాటి నుంచి రెండు నెలలపాటు అవే వేధింపులు ఆ నవవధువుకు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. ఇక వేగలేక మనస్తాపం చెంది తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఒక్కగానొక్క కూతురును అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, పెళ్లయిన రెండు నెలలకే భర్త వేధింపులు తాళలేక తనువు చాలించిందని, గుండెలు బాదుకుంటూ ఆమె తల్లిదండ్రులు శ్రీను, నాగమణి రోదిస్తున్నారు.