Students Suicide: జీవితం చాలా విలువైనదనే విషయం తెలియని బాలలు ఎందరో ఆదిలోనే తనువు చాలిస్తున్నారు. చదువులో వెనుకబడతామనో, ఫెయిలయ్యామనో, తల్లిదండ్రులు, గురువులు మందలించారనో, తోటి విద్యార్థులు చులకనగా చూశారనో ఎందరో రోజూ ఓ చోట ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ కోవలోనే తాజాగా తెలంగాణలో వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిలైనందుకు ఐదుగురు విద్యార్థులు తనువులు చాలించారు.
Students Suicide: మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లోని జయశంకర్ కాలనీకి చెందిన అక్షయ అనే విద్యార్థి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలోనే గణితం సబ్జెక్టులో ఫెయిలైంది. అయితే ఇటీవలే సప్లిమెంటరీ పరీక్షరాసింది. ఆ ఫలితాలు నిన్ననే విడుదలయ్యాయి. వాటిని చూడగానే మళ్లీ ఫెయిలయ్యానని మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.
Students Suicide: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దాస్ తండాకు చెందిన గుగులోత్ హారిక (17) ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలో బాటనీ పరీక్ష ఫెయిలైంది. ఇటీవల జరిగిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసింది. అందులోనూ బాటనీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో హారిక కూడా మనస్తాపం చెందింది. ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.
Students Suicide: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మహాబత్‌పూర్ గ్రామానికి చెందిన వెంకటరమణ (18) ఇంటర్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల్లోనే ఫెయిలయ్యాడు. ఇటీవల రాసిన సప్లిమెంటరీ పరీక్షల్లోనూ ఒక్కదాంట్లోనూ ఉత్తీర్ణత కాలేకపోయాడు. దీంతో మనస్తాపంతో ఉరేసుకొని వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో, హైదరాబాద్ మోతీనగర్‌లో ఒక్కొక్కరు చొప్పున ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
Students Suicide: ఇలా ఆ ముగ్గురు విద్యార్థులు అర్ధాంతరంగా తనువులు చాలించి వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఇదే జీవితం కాదు కదా.. ఇంకా ఉన్నది.. పట్టుదలతోనైనా ఫలితాలను అధిగమించాలి.. లేదా మరో రంగాన్నైనా ఎంచుకొని విజేతగా నిలవాలని కానీ, ఇలా బాల్యంలోనే జీవితాలను ముగించవద్దని మానసిక విశ్లేషకులు సూచిస్తున్నారు.