Varanasi

Varanasi: మహేష్ బాబు ఐదు పాత్రల్లో కనిపిస్తారా?

Varanasi: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడానికి ‘దర్శక ధీరుడు’ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘వారణాసి’. అనౌన్స్ చేసినప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతోంది. తాజాగా మహేష్ బాబు క్యారెక్టర్‌కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఈ సినిమాలో మహేష్ బాబు ఐదు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరిగిన టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో మహేష్ బాబు క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లు స్పష్టమైంది. అలాగే ఈ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ.. మహేష్ బాబు ‘రాముడి’ పాత్రలో కూడా కనిపిస్తారని హింట్ ఇచ్చారు. టైటిల్ టీజర్‌లో చూపించిన ప్రతి ప్రపంచంలోనూ మహేష్ ఒక్కో పాత్రలో కనిపిస్తారేమో అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Rakul Preet Brother: టాలీవుడ్ డ్రగ్స్ సెగ.. డ్రగ్స్‌ కేసులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ సోదరుడు పరారీ

టైమ్ ట్రావెల్ మరియు గ్లోబల్ అడ్వెంచర్ ఈ సినిమా కేవలం గ్లోబల్ అడ్వెంచర్ మాత్రమే కాదు, ఇందులో ‘టైమ్ ట్రావెల్’ అంశం కూడా ఒక భాగమని సమాచారం. దీని ప్రకారం.. ‘రుద్ర’ అనే పాత్రే కాలంలో ప్రయాణిస్తూ (Time Travel) ప్రతి కాలఖండంలోనూ కనిపిస్తుందనేది మరో థియరీ. సినిమా కథ మొత్తం ‘వారణాసి’ నేపథ్యం చుట్టూ తిరగనుంది. ఒకవేళ మహేష్ బాబు నిజంగానే ఐదు పాత్రల్లో నటిస్తే, తన నటనా విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపే అవకాశం దక్కుతుంది.

షూటింగ్ అప్‌డేట్: మహేష్ బాబు తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను వచ్చే ఏడాది సమ్మర్ లోపు పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం సినిమా ప్రొడక్షన్ పనులతో పాటు సమాంతరంగా గ్రాఫిక్స్ (VFX) పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *