SSMB 29: మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా సినీ ప్రియుల్లో జోష్ నింపుతోంది. ఈ భారీ జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రీ-ప్రొడక్షన్ దశ నుంచే హైప్ క్రియేట్ చేసింది. ఒడిశాలోని కోరాపుట్‌లో ఇప్పటికే జరిగిన షూటింగ్‌లో మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక సన్నివేశాల్లో నటించారు.
Also Read: OG: పవన్ కళ్యాణ్ ‘ఓజి’ యాక్షన్ జోష్.. ఫైనల్ కి చేరిన షూటింగ్?
SSMB 29: తాజాగా, సమ్మర్ బ్రేక్ తర్వాత జూన్ 10 నుంచి వారణాసిలో భారీ సెట్స్‌లో మరో కీలక షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్‌లో రాజమౌళి టీమ్ క్రేజీ సీన్స్‌ను షూట్ చేయనుందని టాక్. సుమారు 1000 కోట్ల బడ్జెట్‌తో, పౌరాణిక టచ్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో సర్‌ప్రైజ్ చేయనున్నారు. బాహుబలి, RRR తరహాలో ఈ చిత్రం కూడా గ్లోబల్ లెవెల్‌లో ఆకట్టుకోనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఏ స్థాయిలో ఆకర్షిస్తుందో చూడాలి!