Varanasi

Varanasi: ఓవర్సీస్ కె రికార్డు ధర.. పండగ చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్

Varanasi: తెలుగు సినిమా దర్శకుడి నుండి తన నెక్స్ట్ సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేసే స్థాయికి ఎదిగిన దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో వారణాసి (Varanasi) అనే సినిమా తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంటే, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా పైన ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం ‘ఫార్స్ ఫిలిమ్స్’ సంస్థ వారణాసి ఓవర్సీస్ రైట్స్ ని భారీ మొత్తంతో కొనుగోలు చేసింది. సుమారు రూ.160 కోట్ల భారీ మొత్తంతో కైవసం చేసుకున్నారు. దీన్ని బట్టే తెలుస్తుంది వారణాసి సినిమా పైన క్రేజ్ మామూలుగా లేదని. ఇప్పుడు డౌట్ ఒక్కటే.. ఓవర్సీస్ రైట్స్ ఇంత పలికితే, ఇంకా థియేటర్, శాటిలైట్ రైట్స్ తో ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

వారణాసి సినిమా ఒక అడ్వెంచర్ అండ్ టైమ్ ట్రావెల్ సినిమా. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఇందులో నటించిన నటీనటులు, ఇంకా టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. కొన్ని రోజుల ముందు ప్రియాంకా చోప్రా నటించిన ‘’ది బ్లఫ్’’ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా వారణాసి గురించే మాట్లాడింది. ఇంకా ఆరు నెలల షూటింగ్ ఉందని, నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ కానున్నట్టు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *