Sridevi: మినీ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా సినిమా పూజా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సినిమాలో కేజేఆర్ కథానాయకుడిగా నటించనుండగా, ‘కోర్ట్’ చిత్రంతో మంచి గుర్తింపు పొందిన శ్రీదేవి అప్పల కథానాయికగా నటిస్తున్నారు. అర్జున్ అశోకన్, హరీష్ కుమార్, అజు వర్గీస్, అభిషేక్, ఆశ్విన్ కుమార్, రీగన్ స్టానిస్లాస్ వంటి నటులు ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: Kill Movie: కిల్ రీమేక్‌తో సినీ ప్రియులకు షాకింగ్ సర్‌ప్రైజ్!
ఈ చిత్రానికి మెలోడీ స్పెషలిస్ట్ ఘిబ్రాన్ సంగీతం అందించనుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను పీవీ శంకర్ స్వీకరించారు. నిర్మాతలు మాట్లాడుతూ, ఈ సినిమా ప్రత్యేకంగా యువతను ఆకర్షించే కథతో తెరకెక్కుతోందని తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి ఆసక్తి చూపుతున్నారు. ‘కోర్ట్’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ అందుకున్న శ్రీదేవి, ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
Kickstarting the pooja for #MiniStudios‘ production no.15, #KJR‘s next, with blessings and good vibes 🙏✨@ministudiosllp @KJRuniverse #ArjunAshokan #SrideviApalla #HarishKumar @AjuVarghesee @Abishek_jg @ashwin_kkumar @REGANSTANISLAUS @GhibranVaibodha @pvshankar_pv pic.twitter.com/hP5PDbtBq6
— Mini Studios LLP (@ministudiosllp) July 7, 2025

