Sreeleela: అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లెనిన్’ నుంచి సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న యంగ్ డాన్సింగ్ స్టార్ శ్రీలీలను నిర్మాతలు తప్పించారని సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల డ్యాన్స్, ఎనర్జీ అఖిల్‌కు సరిపోతాయని ఆమెను ఎంపిక చేశారు. అయితే, షూటింగ్ మొదలైన తర్వాత శ్రీలీల డేట్స్ సర్దుబాటు చేయలేకపోతున్నారని, షెడ్యూల్స్ వాయిదా పడుతుండటంతో నిర్మాతలు ఆమె స్థానంలో కొత్త హీరోయిన్ కోసం గాలింపు మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే, శ్రీలీల బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్లు టాక్. కార్తీక్ ఆర్యన్‌తో ఓ హిందీ చిత్రంతో పాటు మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, తెలుగులో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రవితేజ ‘మాస్ జాతర’ చిత్రాలను పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలీల తెలుగు సినిమాలను పక్కనపెడుతోందనే చర్చ జోరందుకుంది.ఇక ‘లెనిన్’లో కొత్త హీరోయిన్ ఎవరనేది త్వరలో తేలనుంది.