Prabhas

Prabhas: స్పిరిట్ షూటింగ్ అప్డేట్.. సాలిడ్ ఫిజిక్ కోసం ప్రభాస్ కసరత్తులు!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న ప్రభాస్, మరో డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ సినిమాలో నటించబోతున్నాడు.ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఈ సినిమా కోసం ప్రభాస్ పూర్తి ఫిజిక్‌లోకి రానున్నాడు. కాగా, ఈ సినిమా షూటింగ్‌ను మే నెల చివరినాటికి ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు మూడు నెలల సమయం ప్రభాస్‌కు దొరికినట్లు అయ్యింది.ఈ గ్యాప్‌లో ప్రభాస్ బాగా జిమ్ చేసి సాలిడ్ ఫిజిక్‌కి రావడం ఖాయమని తెలుస్తోంది. మరి స్పిరిట్ చిత్రం కోసం ప్రభాస్ ఎలాంటి లుక్‌లోకి వస్తాడో చూడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *