Hanuman Jayanti: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి ‘హనుమాన్ లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్’ను విడుదల చేశారు. భక్తి, ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ ప్రత్యేక దుస్తులు https://pvcu.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Also Read: Abdul Kalam biopic: ఆదిపురుష్ డైరెక్టర్ తో ధనుష్ హీరోగా అబ్దుల్ కలాం బయోపిక్ ఫిక్స్!
Hanuman Jayanti: ఈ కలెక్షన్ హనుమాన్ భక్తులకు ఆధ్యాత్మిక ఆకర్షణతో పాటు పౌరాణిక గాథలను వ్యక్తీకరించే అవకాశం కల్పిస్తుందని PVCU బృందం వెల్లడించింది.ఈ కలెక్షన్‌లో ప్రస్తుతం స్టైలిష్ టీ-షర్టులు అందుబాటులో ఉండగా, రాబోయే రోజుల్లో హూడీలు, ఇతర యాక్సెసరీలు కూడా చేర్చనున్నారు. నాణ్యమైన, ప్రత్యేకమైన మెర్చండైజ్‌ను ఇష్టపడే వారికి ఈ కలెక్షన్ ఆకర్షణీయంగా ఉంటుంది. హనుమాన్ సినిమాకు లభించిన అపూర్వ స్పందనతో ఈ కలెక్షన్‌కు కూడా భారీ ఆదరణ లభిస్తుందని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారు.

