WTC Final: 2023-25 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభమైన 2 రోజుల్లోనే ఉత్కంఠభరితమైన ముగింపుకు చేరుకుంది. పేసర్ల పరాక్రమం, బ్యాటర్ల ప్రతిభకు సాక్ష్యంగా నిలిచే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ట్రోఫీ కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి రోజు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్ కాగా, గురువారం దక్షిణాఫ్రికా 138 పరుగులకు ఆలౌట్ అయి 74 పరుగులు వెనుకబడి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కూడా బ్యాటింగ్ వైఫల్యాన్ని ఎదుర్కొంది. మూడో రోజు 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆ జట్టు మొత్తం 218 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మొదటి రోజు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 4 వికెట్లకు 43 పరుగులు చేసింది. 2వ రోజు కెప్టెన్ టెంబా బావుమా బేడింగ్‌హామ్ ఐదో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 94 పరుగులు ఉన్నప్పుడు 36 పరుగులు చేసిన బావుమా ఔట్ అవ్వగా.. కైల్ వెరీన్ (13) అవుట్ అయ్యే సమయానికి జట్టు స్కోరు 126 పరుగులు. ఆ తర్వాత, దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఎక్కువసేపు లేదు. బేడింగ్‌హామ్ 45 పరుగులకు అవుట్ అవ్వగా.. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు పడ్డాయి. ఆ జట్టు చివరి 5 వికెట్లు 12 పరుగులకే కూలిపోయాయి.
Also Read: WTC Final 2025: WTC చరిత్రలో రికార్డు సృష్టించిన రబాడ
ఆసీస్ కు షాక్:
2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ పెవిలియన్ పరేడ్ నిర్వహించింది. లాబుస్చాగ్నే 22 పరుగులు చేసినప్పటికీ, ఉస్మాన్ ఖవాజా (6), గ్రీన్ (0), ట్రావిస్ హెడ్ (9), స్టీవ్ స్మిత్ (13), వెబ్‌స్టర్ (9) మెరుగ్గా రాణించలేకపోయారు. 73 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆ జట్టుకు అలెక్స్ కారీ (43) అండగా నిలిచారు. ప్రస్తుతం మిచెల్ స్టార్క్ (16 నాటౌట్), లియాన్ (01) మూడో రోజు క్రీజులో ఉన్నారు.
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక 5+ వికెట్లు తీసిన కెప్టెన్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమ్మిన్స్ 3వ స్థానానికి ఎగబాకాడు. అతను ఈ ఘనతను 9 సార్లు సాధించి.. భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడిని అధిగమించాడు. పాకిస్తాన్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్ ఈ ఘనతను 12 సార్లు సాధించగా.. ఆస్ట్రేలియాకు చెందిన రిచీ బెనాడ్ 9 సార్లు ఈ ఘనతను సాధించారు.
300 వికెట్లు తీసిన 8వ ఆస్ట్రేలియా బౌలర్
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ టెస్ట్ క్రికెట్‌లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 8వ ఆస్ట్రేలియా బౌలర్‌గా అతను నిలిచాడు. అంతకుముందు స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ 708 వికెట్లు, గ్లెన్ మెక్‌గ్రాత్ 563, నాథన్ లియాన్ 553, మిచెల్ స్టార్క్ 384, డెన్నిస్ లిల్లీ 355, మిచెల్ జాన్సన్ 313, బ్రెట్ లీ 310 వికెట్లు పడగొట్టారు.