Sonu Sood: టాలీవుడ్ నటుడు సోనూ సూద్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య సోనాలీ సూద్ రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం ముంబై-నాగ్‌పూర్ హైవేపై ఈరోజు ఉదయం జరిగింది. ప్రమాద సమయంలో ఆమెతో పాటు సోదరి కుమారుడు మరో మహిళ కారులో ప్రయాణిస్తున్నారు.
ఓ ట్రక్కు వారి కారును ఢీకొట్టడంతో సోనాలీ సూద్ తీవ్రంగా గాయపడగా, మిగతా ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కారు పూర్తిగా దెబ్బతిందని తెలుస్తోంది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే సోనాలిని నాగ్‌పూర్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు, అయితే గాయాల తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదు.
Also Read: Google Internship: గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2025
Sonu Sood: ఈ ఘటనపై సోనూ సూద్ ఇంకా స్పందించలేదు. అయితే, రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఆయన గతంలో తీసుకున్న చర్యలు గుర్తుకు వస్తున్నాయి. ఇటీవలే రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన కుటుంబ సభ్యుడే ఇప్పుడు ప్రమాదానికి గురికావడం దురదృష్టకరం. ఇంకా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.