Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ అధ‍్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. వేసవి సెలవుల సందర్భంగా కుమార్తె ప్రియాంకా గాంధీ కుటుంబంతో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లాకు వెళ్లిన ఆమెకు అనారోగ్యం వచ్చినట్లు సమాచారం. దీంతో వెంటనే శిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (IGMC)కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆసుపత్రిలో సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో సోనియాగాంధీకి ఎంఆర్ఐ, ఇసిజి వంటి పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అవసరమైన చికిత్సలు అందిస్తున్నామని, ఎటువంటి ఆందోళనకు అవసరం లేదని వారు స్పష్టం చేశారు.

