Sonakshi Sinha: నటి సోనాక్షి సిన్హా కొన్ని ఈ-కామర్స్ బ్రాండ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ఫొటోలను వెంటనే తొలగించమని గట్టిగా హెచ్చరించారు. సోనాక్షి సిన్హా తరచూ ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో, బ్రాండ్‌ల అధికారిక పేజీలలో తన వ్యక్తిగత ఫొటోలు కనిపించాయి. ఆ ఫొటోలను ఆమె అనుమతి లేకుండా, ఉపయోగించుకునే హక్కులు తీసుకోకుండా లేదా కనీసం ఒక చిన్న అభ్యర్థన కూడా చేయకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆమె గమనించారు.దీనిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ చర్య ఆమోదయోగ్యం కాదని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. “నేను ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటాను.
ఈ క్రమంలో నా ఫొటోలు కొన్ని బ్రాండ్ల వెబ్‌సైట్‌లలో కనిపించడం చూసి ఆశ్చర్యపోయాను. అవి నా అనుమతి లేకుండా, ఉపయోగించుకునే హక్కులు లేకుండా, కనీసం ఒక రిక్వెస్ట్ కూడా చేయకుండా వాడేసుకున్నారు. ఇది ఎలా ఆమోదయోగ్యం? ఒక నటి మీ దుస్తులు లేదా ఆభరణాలు ధరించినప్పుడు, మేము వాటి బ్రాండ్‌కు క్రెడిట్ ఇస్తూ పోస్ట్ చేస్తాము. కానీ మీరు అదే ఫొటోలను మీ అధికారిక వెబ్‌సైట్‌లో వాడటం సరికాదు. ఇది ఏ మాత్రం నైతిక బాధ్యత కాదు.” సోనాక్షి ఆయా బ్రాండ్‌లకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
Also Read: SSMB29: గ్లోబల్ సంచలనం: SSMB29 రికార్డ్ రిలీజ్!
“పనిగట్టుకుని నేను మీ బ్రాండ్‌ల పేర్లు బయటపెట్టకముందే, నా ఫొటోలను వెబ్‌సైట్‌ల నుంచి వెంటనే తొలగించండి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. నా ఇన్వాయిస్‌ను ఎక్కడ పంపాలో చెప్పండి, అది మీ ఇష్టం” అని ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై నటి టబు కూడా సోనాక్షికి మద్దతుగా స్పందించి, నా ఆలోచనలు కూడా అవే అని పేర్కొన్నారు. ఇదిలాంటి సమస్యను ఎదుర్కొంటున్నది తాను ఒక్కదాన్నే కాదని సోనాక్షి అన్నారు. గతంలో కూడా అనుష్క శర్మ, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు కూడా తమ అనుమతి లేకుండా బ్రాండ్లు తమ చిత్రాలను ఉపయోగించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది డిజిటల్ యుగంలో కాపీరైట్ మరియు గోప్యతా సమస్యల ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేసింది.