Chain Snatching: అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా పోలీసులు గురువారం ఓ చైన్ స్నాచర్‌ను అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని గుర్తించడంతో పోలీసులు కూడా విస్తుపోయారు. ఎందుకంటే, నిందితుడు మధ్యప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే కుమారుడని తేలింది. విచారణలో ప్రియురాలి అవసరాల కోసం తొలిసారి చైన్ స్నాచింగ్(Chain Snatching)కు పాల్పడి పట్టుబడ్డానని చెప్పాడు.
విచారణలో, 25 ఏళ్ల ప్రద్యుమన్ సింగ్ చంద్రావత్ కొన్ని నెలల క్రితం తన తల్లిదండ్రులను ఇంటిని వదిలి అహ్మదాబాద్‌కు వచ్చానని చెప్పాడు. ఇక్కడ రూ.15 వేల జీతంతో ఉద్యోగం చేస్తునట్టు తెలిపాడు. ఉద్యోగంలో ఉండగానే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కానీ, రూ.15 వేల జీతంతో ప్రియురాలి అవసరాలు తీర్చలేక నేరం వైపు మొగ్గు చూపాడు.
ఈ సంఘటన జనవరి 25 రాత్రి జరిగింది
థాల్తేజ్ ప్రాంతంలోని జయంబనగర్ సొసైటీలో అద్దె ఇంట్లో నివసిస్తున్న 25 ఏళ్ల ప్రద్యుమన్ సింగ్ విజేంద్ర సింగ్ చంద్రావత్ జనవరి 25 రాత్రి ఈ నేరానికి పాల్పడ్డాడు. మేమ్‌నగర్‌లోని రాజ్‌వి టవర్‌లో నివాసం ఉంటున్న 65 ఏళ్ల వాసంతీబెన్ అయ్యర్ మెడలో నుంచి రెండున్నర తులాల గొలుసును లాక్కెళ్లాడు. ఈ విషయమై వాసంతీబెన్ ఘట్లోడియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఘటనా స్థలం నుంచి రోడ్లపై ఉన్న దాదాపు 250 సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు నిందితుడు ప్రద్యుమన్ వద్దకు చేరుకున్నారు. ప్రద్యుమన్ నుంచి బంగారు గొలుసులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Union Budget 2025: ఇన్ కమ్ టాక్స్ పై పెద్ద ఊరట: 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు
