Telangana: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఇల్లరికం వచ్చిన తనను అత్తమామ, భార్య చిన్నచూపు చూశారని ఓ వ్యక్తి.. ఆరేండ్లలోపు వయసున్న తన ఇద్దరు కొడుకులను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయగావకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి (36) 12 ఏండ్ల క్రితం తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నందివాడకు చెందిన చిట్టెపు గుండారె, సుగుణవ్వల కుమార్తె అపర్ణను వివాహం చేసుకొని ఇల్లరికం వచ్చాడు.
Telangana: కొన్నిరోజుల వరకు శ్రీనివాస్‌రెడ్డి దంపతుల కుటుంబం సాఫీగానే సాగింది. వారికి ఇద్దరు కొడుకులు కలిగారు. ఇటీవల కుటుంబంలో విభేదాలు పొడచూపాయి. భార్యతోపాటు అత్తామామలతో పడటం లేదు. నువు ఇల్లరికం వచ్చావు అంటూ అత్తమామ, భార్య పెత్తనం చెలాయిస్తూ వేధింంచసాగారు. దీంతో ఆరునెలలుగా శ్రీనివాస్‌రెడ్డి వేరుగా ఉంటున్నాడు.
Telangana: ఈ దశలో క్రికెట్ బెట్టింగ్, జూదానికి అలవాటు పడిన శ్రీనివాస్‌రెడ్డి రూ.లక్ష వరకు అప్పు చేసినట్టు తెలిసింది. అత్తామామలు, భార్యతో విభేదాలు, వేరుగా ఉండటం, జూదంతో అయిన అప్పులతో మరింత మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో దసరా సందర్భంగా జమ్మి పెడతానని తన కుమారులైన విగ్నేష్‌రెడ్డి (4), అనిరుధ్‌రెడ్డి (6)ని తన వెంట తీసుకెళ్లాడు.
Telangana: తన వ్యవసాయ భూమిలో ఉన్న బావి వద్దకు కొడుకులను తీసుకెళ్లి అందులో తోసేశాడు. ఆపై తాను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ముగ్గురి మృతదేహాలు నీటిలో తేలడంతో గుర్తించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.