VM Thomas: కార్వేటి నగరం మండలం పరిధిలోని అన్నూరు పంచాయతీ అలాగుంట గ్రామానికి సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన డాక్టర్ థామస్ అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం ప్రతి పల్లెలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర పల్లెల్లోఅభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని అదే దిశగా గంగాధర్ నెల్లూరు అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు అందులో భాగంగా మూడు కోట్ల అరవై ఐదు లక్షలు 6:30 కి.మీ మంజూరు చేశామని రెండో విడత మూడో విడతగా మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు గంగాధర్ నెల్లూరు జనసేన పార్టీ ఇంచార్జ్ పొన్నయుగంధర్ మాట్లాడుతూ మంచి ప్రభుత్వం అనడానికి ఉదాహరణ పల్లె పండుగలు ఈ వారోత్సవ సభలన్నీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయని సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చెంగల్రా యాదవ్ ఎంపీడీవో ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.
