SLBC Praject:ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకొని గల్లంతైన 8 మంది కోసం గత ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. 11 సంస్థలతో ఈ ఆపరేషన్‌ను ప్రభుత్వం చేపడుతున్నది. ఒక్కో షిప్ట్‌కు 100 మందికి పైగా ఉద్యోగులు శ్రమిస్తున్నారు. నాలుగు రోజులుగో నిరంతరాయకంగా పనులు కొనసాగుతున్నాయి. అందరినీ సజీవంగా బయటకు తీసుకురావడానికి ఆ 11 సంస్థలు పనిచేస్తున్నాయి. గంటలు గడిచే కొద్దీ ఉత్కంఠ పెరుగుతున్న నేపత్యంలో వీలైనంత త్వరగా లోపలికి చేరుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.
SLBC Praject:టన్నెల్ లోపలికి వెళ్లేందుకు బురద, నీరుతోపాటు అడ్డుపడిన యంత్ర పరికరాలు సహాయక చర్యలకు అడ్డంకిగా మారాయి. దీంతో వాటిని తొలగించేందుకు ముమ్మర యత్నం చేస్తున్నారు. ఈ దశలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) యంత్ర పరికరాలు పూర్తిగా అడ్డుపడటంతో అక్కడే సహాయక చర్యలు నిలిచిపోయాయి. టీబీఎం ముక్కలై చెల్లాచెదురుగా పడి ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగడం లేదు. దీంతో ఆ యంత్ర పరికరాలను ముక్కలుగా చేసి తొలగించి లోపలికి వెళ్లేందుకు ఈ రోజు పనులు కొనసాగుతున్నాయి.
SLBC Praject:టీబీఎం యంత్ర పరికరాలను తొలగించి, అక్కడి నుంచి దాటాలంటే టన్నెల్‌లో భారీగా పేరుకుపోయిన బురద, నీరు మరో అడ్డంకిగా మారాయి. వాటిని పూర్తిగా తొలగించినా, రిజర్వాయర్ నుంచి కానీ, లీకేజీల వల్ల కానీ బురద, నీరు మళ్లీ చేరే అవకాశం ఉండటంతో తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి.
SLBC Praject:ఇదే దశలో ఓ విషయంపై ఆందోళన కలిగించే అంశం చర్చనీయాంశంగా మారింది. పైకప్పు కూలిన ప్రాంతానికి గురువారం (ఫిబ్రవరి 27) రెస్క్యూ ఆపరేషన్ బృందాలు చేరుకున్నాయి. ఘటనాస్థలంలో బండరాళ్లు, బురద, నీరు భారీగా పోగై ఉన్నాయి. వందల మీటర్ల వరకు మట్టిని తవ్వే పనుల్లో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి. ఈ దవలో ఆ శిథిలాల కింద గల్లంతైన వారు ఉండి ఉండొచ్చనే అనుమానం కూడా వారిలో కలిగినట్టు తెలుస్తున్నది. దీంతో తొలగిస్తున్న ఆ శిథిలాల కింద గాలింపు చర్యలు చేపడుతున్నారు.
టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారు చుట్టూ ఉన్న బురదలో కూరుకుపోయి చనిపోయి ఉండొచ్చని రెస్క్యూ బృందాలే భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రమాదస్థలంలో మట్టి, బురద తప్ప కార్మికుల జాడ లేదని సమాచారం. లోపల కూలిన మట్టి, రాళ్లను తీయాలంటే ఏడాదికి పైగా పడుతుందని చెప్తున్నట్టు సమాచారం. నూరుశాతం గల్లంతైన వారు బతికే చాన్స్ లేదని అన్నట్టు వినికిడి. ఏదేమైనా గల్లంతైన ఆ 8 మంది బాధితులు క్షేమంగా బయటకు రావాలని కోరుకుందాం.

