SLBC Praject: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. శనివారం (మార్చి 1) నాటికి రెస్క్యూ ఆపరేషన్ 8వ రోజుకు చేరుకున్నది. గల్లంతైన ఆ 8 మంది వారి ఆచూకీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారంతా చనిపోయారని భావిస్తున్నా, ఆ మృతదేహాలైన దొరుకుతాయా? లేదా? అన్న మీమాంస నెలకొన్నది. మరోవైపు టన్నెల్ బయట అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్య బృందాన్ని అక్కడికి అధికారులు రప్పించారు. మృతదేహాలు లభిస్తే అక్కడే పంచనామా అవకాశం ఉన్నది.
SLBC Praject: జీపీఆర్ పరికరం ద్వారా 5 లోకేషన్లలో మెత్తటి వస్తువులు ఉన్నట్టు నిన్న గుర్తించారు. అయితే ఆ మెత్తటిగా ఉన్న ప్రాంతంలో కార్మికుల మృతదేహాలా, లేక మరో రకమైన పరికరాలా అనే దానిపైనా ఉత్కంఠ నెలకొన్నది. దీంతో ఆ ఐదు లోకేషన్లలో సిబ్బంది ఈ రోజు డ్రిల్లింగ్ పనులు చేస్తున్నారు. కనీసం 3 నుంచి 5 మీటర్లు తవ్వితే అక్కడ ఏమున్నదనే దానిపై క్లారిటీ వస్తుంది.
SLBC Praject: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద 8వ రోజైన శనివారం పూర్తిగా ఆంక్షలు విధించారు. అక్కడికి గల్లంతైన వారి కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. మృతదేహాలు లభిస్తే పంచనామా కార్యక్రమాలు చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. లోకోట్రైన్ ద్వారా 11.5 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లి మట్టిని బయటకు తరలిస్తున్నారు. ప్రమాద స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల లోతు బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. దీంతో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్షిస్తున్నారు.