SJ Suryah: ప్రముఖ నటుడు, దర్శకుడు SJ సూర్య దాదాపు 10 సంవత్సరాల తర్వాత ‘కిల్లర్’ అనే పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా సంచలన రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గోకులం మూవీస్, ఏంజెల్ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక హిట్‌మ్యాన్ చుట్టూ తిరిగే కథతో యాక్షన్, రొమాన్స్, కామెడీ అంశాల మిళితంగా రూపొందుతోంది. ‘జేమ్స్ బాండ్ మీట్స్ ఖుషి’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా భారత్‌లోని వివిధ లొకేషన్స్‌తో పాటు మెక్సికోలో కూడా చిత్రీకరణ జరుపనుంది. SJ సూర్య స్వయంగా లీడ్ రోల్‌లో నటిస్తూ, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నారు. 1999లో ‘వాలీ’ సినిమాతో దర్శకుడిగా సంచలనం సృష్టించిన సూర్య, తన చిత్రాలతో తన టాలెంట్‌ను చాటుకున్నారు. ఈ సినిమాతో మరోసారి ఆయన దర్శకత్వ ప్రతిభ ఆవిష్కరణ కానుంది. సినీ అభిమానుల్లో ‘కిల్లర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Hi folks , Ur Director S.J.Suryah is bk 🥰🥰🥰 with His Dream project titled, Yah U know it 🔥🔥🔥#KILLER🔥🔥🔥 feeling blessed and happy to collaborate with the most prestigious @GokulamMovies Gokulam Gopalan sir 🥰🥰🥰🥰 need Ur love and support as always🥰🥰🥰 love U all 🙏SJS… pic.twitter.com/XlLK5GY3Jb
— S J Suryah (@iam_SJSuryah) June 27, 2025

