Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. సెరీన్ ఆచార్జ్ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ఓ పుట్టినరోజు వేడుకలో డ్రగ్స్, విదేశీ మద్యం పట్టుబడటంతో పోలీసులు చర్యలు చేపట్టారు.
పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఫామ్‌హౌస్‌పై ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ. 2 లక్షల విలువ చేసే డ్రగ్స్‌తో పాటు మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, ఆరుగురు ఐటీ ఉద్యోగులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు వారిని వెంటనే అరెస్ట్ చేశారు.