Sitara Ghattamaneni: ఈ రోజు పంజాగుట్టలో PMJ జువలర్స్ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. మహేష్ బాబు కూతురు సితారా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 60 సంవత్సరాల క్రితం, 1964లో ప్రారంభం అయిన ఈ ప్రయాణం నేటికి ప్రజల మన్ననాలతో విజయవంతగా దూసుకెళ్తుంది. గత 6 దశాబ్దాలుగా మీ అత్యంత విశ్వసనీయ ఆభరణ వ్యాపారిగా, మీరు గర్వంగా ధరించే ప్రతి PMJ ఆభరణంలో ప్రామాణికతను కాపాడుతూ మా వాగ్దానాన్ని నిలబెట్టాము.
ఆభరణాలు కేవలం అలంకార వస్తువులు మాత్రమే కాదు. అంత కంటే ఎక్కువ. PMJ ఆభరణాలను సితారా ప్రారంభించడం సంతోషంగా ఉందని యాజమాన్యం తెలిపింది. 1964 నుంచి మేము అత్యంత ఆదరణీయ స్వర్ణకారులుగా ఉంటూ వినియోగదారుల సంతోషంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ రోజు 40వ స్టోర్‌ను పంజాగుట్టాలో ప్రారంభిస్తున్నాము అని, హాఫ్ సారీ ఫంక్షన్‌ల నుండి వార్షికోత్సవ ఉత్సవాల వరకు అన్నింటికీ సరిపడే విస్తృత శ్రేణి ఆభరణాలను ఈ షాప్ లో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.
Also Read: Akshaya Tritiya 2025: ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడొచ్చింది.. శుభ సమయం, విశిష్టతలేంటో తెలుసుకోండి…
సరికొత్త డిజైన్‌లతో మీ అభిరుచికి తగ్గట్టుగా ఇక్కడ అన్ని ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. 40 స్టోర్‌లలోనూ సొంత డిజైన్ లు, తయారీ యూనిట్ కలిగిన ఏకైక ప్రాంఛైస్ PMJ సంస్థ అని చెప్పారు. సహజ వజ్రాలతో పొందుబారిచిన ఆభరణాలు ప్రత్యేకం అని యాజమాన్యం చెప్పారు.
ఈ 40వ అతిపెద్ద PMJ స్టోర్, 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, విశాలమైన పార్కింగ్ స్థలంతో నిర్మించామని, మా కస్టమర్‌లను కుటుంబంగా భావిస్తాము అని వారి మనసుకు నచ్చే డిజైన్ లో ఆభరణాలను అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా పంజాగుట్ట బ్రాంచ్ కు విచ్చేసి మంచి ఎక్స్పీరియన్స్ పొందాలని ఆశిస్తున్నట్లు యాజమాన్యం కోరింది.