SIIMA 2025 నామినేషన్స్‌తో దక్షిణ భారత సినిమా రంగం సందడిగా మారింది! తెలుగులో ‘పుష్ప 2’ 11 నామినేషన్స్‌తో అగ్రస్థానంలో నిలవగా, ‘కల్కి 2898 AD’, ‘హనుమాన్’ 10 చొప్పున నామినేషన్స్ సాధించాయి. తమిళంలో ‘అమరన్’ 13 నామినేషన్స్‌తో దూసుకెళ్తోంది, ‘లబ్బర్ పందు’ 8 నామినేషన్స్‌తో సత్తా చాటింది. కన్నడలో ‘భీమా’, ‘కృష్ణం ప్రణయ సఖి’ 9 చొప్పున, ‘ఇబ్బని తబ్బిద ఇలెయాలి’ 7 నామినేషన్స్‌తో ఆకట్టుకున్నాయి.
Also Read: Allu Arjun: AA22 కోసం స్టైలిష్ గా ఐకాన్ స్టార్ సందడి!
మలయాళంలో ‘ది గోట్ లైఫ్’ 10, ‘ARM’ 9, ‘ఆవేశం’ 8 నామినేషన్స్‌తో పోటీలో ఉన్నాయి. ఈ చిత్రాలు అద్భుత కథనం, నటన, సాంకేతికతతో అభిమానులను ఆకర్షించాయి. ఈ వేడుక దుబాయ్‌లో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో జరగనుంది. సో విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే!