miss you teaser

Miss You Teaser: విడుదలైన సిద్ధార్థ్ ‘మిస్ యు’ టీజర్

Miss You Teaser: హీరో సిద్ధార్థ్ ‘చిన్నా’ సినిమా విజయం తర్వాత ‘ఇండియన్ 2’తో మరో పరాజయం ఫేస్ చేశాడు. అయితే ఆ తర్వాత ఎంతో కాలంగా డేటింగ్ లో ఉన్న అదితిరీవు హైదరీని పెళ్ళి చేసుకున్నాడు. గత కొన్నాళ్లుగా పెళ్ళితో బిజీగా ఉన్న సిద్ధార్థ్ ఇప్పుడు మళ్ళీ నటనపై దృష్టి పెట్టాడు. సిద్దూ నటించిన ‘మిస్ యూ’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాకు రాజశేఖర్ దర్శకత్వం వహించారు. అషిక రంగనాథ్ ఇందులో హీరోయిన్. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పస్ట్ లుక్ ను మాధవన్, శివకార్తికేయన్, లోకేష్ కనకరాజ్ రిలీజ్ చేశారు.

ఇది కూడా చదవండి: Shah Rukh Khan: షారూక్ ఖాన్ ను చంపుతానని బెదిరించిన నిందితుడు అరెస్ట్..

Miss You Teaser: ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ టీజర్ ను విజయ సేతుపతి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంప్లీట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ టీజర్ లో పెళ్ళి తర్వాత సిద్ధార్థ్ మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడని అంటున్నారు. మరి నవంబర్ 29న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ‘మిస్ యు’ సినిమాతోనూ సిద్ధార్థ్ మెప్పిస్తాడా? ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ అవుతుందా అన్నది చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *