Siddharth

Siddharth: కొత్త ఆశలతో రాబోతున్న సిద్ధార్థ్?

Siddharth: వరుసగా నిరాశపరిచిన సినిమాలతో సతమతమవుతున్న సిద్ధార్థ్, తాజాగా కొత్త చిత్రం ‘3BHK’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ‘8 తూటక్కల్’ ఫేమ్ శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. శరత్ కుమార్, దేవయాని, ‘గుడ్ నైట్’ ఫేమ్ మీథా రఘునాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం సొంత ఇంటి కలను సాకారం చేసుకుందా లేదా అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళం, తెలుగు భాషల్లో జులై 4న విడుదల కానున్న ఈ సినిమా, నితిన్ తమ్ముడి చిత్రానికి గట్టి పోటీ ఇవ్వనుంది. ఇటీవల తమిళంలో కుటుంబ కథా చిత్రాలైన ‘కుడుంబస్తాన్’, ‘టూరిస్ట్’ హిట్ కావడంతో, ‘3BHK’పై సిద్ధార్థ్ గట్టి ఆశలు పెట్టుకున్నాడు. భావోద్వేగ కథనం, బలమైన తారాగణంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ నమ్మకంగా ఉంది. సిద్ధార్థ్ ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తాడా? వేచి చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: హైదరాబాద్ పబ్బులో కానిస్టేబుల్ ను కాల్చిర్రు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *