3BHK Movie: సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు తన సినిమాలతో యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్టార్ హీరోగా ముద్ర వేసుకున్నాడు. కానీ చాలా కాలం నుంచి సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. అయినా కానీ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా సిద్దు తన లేటెస్ట్ సినిమాను అనాన్స్ చేసాడు. ఈసారి తనకు కలిసొచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేశాడు.
ఇది కూడా చదవండి: Samantha: నాగచైతన్య రెండో పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్!
అందుకే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. శ్రీ గణేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘3BHK’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ చూస్తే హిట్ కళ కనిపిస్తోంది, ఈ సినిమాతో అయిన సిద్దార్ధ్ హిట్ ట్రాక్ లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు అమ్రిత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తుండగా అరుణ్ విశ్వ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.