Shyam Benegal: భారతీయ సినిమా ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూశారు. తాను కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు అని శ్యామ్ బెనెగల్ కుమార్తె పియా బెనెగల్ తెలిపారు.ఆయనికి డిసెంబరు 14న 90 ఏళ్లు నిండిన కొద్ది రోజులకే ముంబైలోని వోకార్డ్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయన చేరారు. 23 డిసెంబర్ 2024న సోమవారం సాయంత్రం 6:38 గంటలకు శ్యామ్ బెనగల్ తన తుదిశ్వాశ విడిచారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.