NTRNeel

NTRNeel: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో శ్రుతి హాసన్!

NTRNeel: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’ (టెంటేటివ్ టైటిల్). పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా గురించి తాజా అప్‌డేట్ సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ స్పెషల్ ఐటెం సాంగ్‌లో సందడి చేయనున్నట్లు సమాచారం.

ప్రశాంత్ నీల్ సినిమాల్లో సాంగ్స్ కథలో భాగంగానే వస్తాయి. అయితే, ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేసేలా ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం శ్రుతి హాసన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘సలార్’లో ప్రశాంత్‌తో పనిచేసిన శ్రుతి, ఈ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు విజువల్ ట్రీట్‌గా నిలవనుంది. శ్రుతి హాసన్ నిజంగానే ఈ సాంగ్‌లో కనిపిస్తుందా? ప్రశాంత్ నీల్ ఎలాంటి మాస్ మ్యాజిక్ సృష్టిస్తాడో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *