Tirupati

Tirupati: తిరుపతిలో భయాందోళనలు.. సైకో వీరంగం, ఒకరు మృతి!

Tirupati: తిరుపతి నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిలతీర్థం రోడ్డులో ఓ దుండగుడు కత్తి, కర్రలతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు గాయపడగా, ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని శేఖర్ (55) గా గుర్తించారు. శేఖర్‌ స్థానికంగా జీవనం కొనసాగిస్తున్నాడు. మరో ఇద్దరు గాయపడిన వారిని కపిలతీర్థం పార్కింగ్‌లో పని చేసే సుబ్రహ్మణ్యం, అదే ప్రాంతానికి చెందిన మహిళ కల్పనగా గుర్తించారు. ఈ ఇద్దరిని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్టు సమాచారం.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. దాదాపు ఒక గంటపాటు నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది, స్థానికులు కలిసి తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు నిందితుడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ranbir kapoor: రామాయణం కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్న రణబీర్

నిందితుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని ‘సైకో’గా గుర్తించిన అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దాడి చేసిన వ్యక్తి అర్థ రహితంగా మాట్లాడటంతో అతడి మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో తిరుపతి నగరవాసుల్లో భయం పెరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cm revanth: మేం ఇక ఢిల్లీకి రాబోం, ప్రధాని మోదీ మా గల్లీకి రావాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *