Jananayagan: విజయ్ లాస్ట్ సినిమా జననాయగన్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చేశాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం భారీ టార్గెట్ పెట్టారు నిర్మాతలు. ఆ లెక్కలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన జననాయగన్.. ఇప్పటివరకు రికార్డు బిజినెస్ చేసిన తమిళ చిత్రం అని తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన బ్రేక్ ఈవెన్ లెక్కలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
Also Read: Akhanda 2: అఖండ 2కి ఏపీలో టికెట్ ధరల పెంపు..!
తమిళనాడులోనే సుమారు 220 కోట్ల బిజినెస్ అయిందని సమాచారం. ఇక కర్ణాటకలో 30 కోట్లు, కేరళలో 35 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్ టార్గెట్ ఉంది. ఓవర్సీస్లో ఏకంగా 210 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని టాక్. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 515 కోట్లకు పైగా గ్రాస్ సాధిస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇప్పటివరకు ఏ తమిళ హీరో సినిమా కూడా ఈ రేంజ్ బ్రేక్ ఈవెన్ ను అందుకోలేదు. కాబట్టి విజయ్ లాస్ట్ ఫిల్మ్ ఈ రికార్డును బద్దలు కొట్టగలదా అన్నది కోలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

