Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఆదాయం కేవలం సినిమాలకే పరిమితం కాదు. ఆమె బాస్టియన్ రెస్టారెంట్ చైన్‌తో వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నారు. ముంబైలోని బాంద్రాలో మొదలైన బాస్టియన్, ఇప్పుడు దేశవ్యాప్తంగా మెట్రో నగరాలకు విస్తరించింది. 2019లో రెస్టారెంట్ యజమాని రంజిత్ బింద్రాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న శిల్పా, బ్రాండ్‌లో 50% వాటాతో సహ యజమానిగా ఉన్నారు.
Also Read: Samantha: సమంతకు ఆగ్రహం తెప్పించిన ఫొటోగ్రాఫర్లు: వీడియో వైరల్!
Shilpa Shetty: ముంబై, పూణే, బెంగళూరు, గోవాలో రెస్టారెంట్లు నడుస్తున్నాయి. గోవాలో మరో రెండు శాఖలు త్వరలో ప్రారంభం కానున్నాయి. నెలకు 5-6 కోట్ల ఆదాయం వస్తుందని, అత్యధిక జీఎస్టీ చెల్లించే రెస్టారెంట్‌గా బాస్టియన్ నిలుస్తోందని శిల్పా వెల్లడించారు. సినీ సెలబ్రిటీలు ఇక్కడ భోజనానికి ఆసక్తి చూపిస్తారు. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వివాహ రిసెప్షన్‌ను బాస్టియన్‌లో ఘనంగా నిర్వహించారు. శిల్పా నికర ఆస్తి సుమారు 134 కోట్లు, భర్త రాజ్ కుంద్రాతో కలిసి దుబాయ్‌లో విల్లాలు కలిగి ఉన్నారు.