Shafali Jarivala:ప్రముఖ నటి, కాంటా లాగా సాంగ్ ఫేమ్ షఫాలీ జరివాలా (42) కన్నుమూశారు. నిన్న అర్ధరాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో వెంటనే ఆమె భర్త ముంబైలోని బల్లేవ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమె మరణంతో సినీలోకం విషాదం అలుముకున్నది. సినీ పరిశ్రమవర్గాలతోపాటు ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Shafali Jarivala:షఫాలీ జరివాలా 2005లో కాంటా లగా రిమిక్స్ సాంగ్‌తో ఫేమ్ అయ్యారు. ఈ పాటతోనే ఆమెకు కాంటా లగా గర్ల్ బిరుదును కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆమె, ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా పనిచేసిన రియాలిటీ హిందీ బిగ్‌బాస్ 13లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత జరివాలా సల్మాన్ ఖాన్ ముజ్బే షాదీ కరోగీ సినిమాలో నటించింది.
Shafali Jarivala:షఫాలీ జరివాలా తొలుత 2004లో షెఫాలీ మీట్ బ్రదర్స్ ఫేమ్ సంగీతకారుడు హర్మీత్‌సింగ్‌ను వివాహం చేసుకున్నది. కానీ, వారిద్దరూ 2009లో విడిపోయారు. 2015లో నటుడు పరాగ్ త్యాగిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. షఫాలీ మృతి విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా ధ్రువకరించకపోవడం గమనార్హం.