Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి సంచలన అప్డేట్?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమా విడుదల గతంలో పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కొత్త రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇప్పుడు మేకర్స్ నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. చిత్ర బృందం ట్రైలర్ కట్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.

Also Read: Kubera: ‘కుబేర’ సక్సెస్‌తో ధనుష్ హ్యాట్రిక్‌కు సిద్ధం?

Vijay Deverakonda: ఈ ట్రైలర్‌తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే, ఈ విషయంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌లో ఈ అప్డేట్ హైప్‌ను పెంచింది. ట్రైలర్, రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  SIIMA Awards 2025: బెస్ట్ మూవీ ‘కల్కి’.. ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. అవార్డ్ విన్నర్స్ లిస్ట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *