Thug Life OTT: కమల్ హాసన్, మణిరత్నం కలయికలో గతంలో వచ్చిన ‘నాయకన్’ సినిమా అభిమానులకు అపురూప అనుభూతినిచ్చింది. అయితే, ఇదే కాంబోలో వచ్చిన ‘థగ్ లైఫ్’ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. థియేటర్లలో మొదటి రోజు నుంచే భారీగా కలెక్షన్లు తగ్గడంతో సినిమా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో, ‘థగ్ లైఫ్’ ఓటీటీ రిలీజ్‌పై చర్చలు ఊపందుకున్నాయి. మొదట 8 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ, బాక్సాఫీస్ వైఫల్యం నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను ముందుగానే తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. తాజా బజ్ ప్రకారం, ఈ చిత్రం దక్షిణాది భాషల్లో జూన్ 27 లేదా జూలై 4న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ జూలై 31 నాటికి విడుదల కానుందని టాక్. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
