Illegal Migrants

Illegal Migrants: అమెరికా నుంచి అక్రమ వలసదారులతో రెండో బ్యాచ్ భారత్ బయలుదేరింది

Illegal Migrants: అమెరికా నుండి అక్రమంగా వచ్చిన భారతీయ వలసదారుల రెండవ బ్యాచ్ ఈరోజు (ఫిబ్రవరి 15) శనివారం రాత్రి 10 గంటలకు పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఇందులో 119 మంది భారతీయులను బలవంతంగా వెనక్కి పంపుతారు. వీరిలో పంజాబ్‌కు చెందిన 67 మంది, హర్యానాకు చెందిన 33 మంది ఉన్నారు. ఈ సమయంలో, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా విమానాశ్రయానికి వెళ్లి అమెరికా నుంచి బహిష్కారానికి గురైన పంజాబీలను కలుస్తారు. దీని తరువాత, ఫిబ్రవరి 16న అంటే ఆదివారం రాత్రి 10 గంటలకు, 157 మంది భారతీయులతో కూడిన విమానం అమృత్‌సర్ చేరుకుంటుంది.

అంతకుముందు ఫిబ్రవరి 5న, అమెరికా వైమానిక దళానికి చెందిన గ్లోబ్‌మాస్టర్ విమానంలో 104 మంది భారతీయులను అమృత్‌సర్‌కు తరలించారు. ఈ వ్యక్తులను చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి తీసుకువచ్చారు. ఈ అంశం వివాదాస్పదమైంది. ఈసారి భారతీయులను ఎలా తీసుకువస్తున్నారు.. వారిని మళ్ళీ చేతికి సంకెళ్లు వేసి పంపుతారా అనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేద

ఇది కూడా చదవండి: Injection: వింటేనే మతిపోతుంది.. ఒక చిన్నారి ప్రాణం కాపాడటానికి 16 కోట్ల రూపాయల ఖరీదైన ఇంజక్షన్!

పంజాబ్ సీఎం మాట్లాడుతూ- అమృత్‌సర్‌లో ల్యాండింగ్ అనేది పంజాబీలను కించపరిచే కుట్ర అని అన్నారు. ‘అక్రమ వలసదారులు పంజాబ్‌లో విమానాలు దిగడం తప్పు. ఇది పంజాబ్‌ను అప్రతిష్టపాలు చేయడానికి చేసిన కుట్ర. అమెరికాకు అక్రమంగా వెళ్లిన వారిని వెనక్కి పంపుతున్నారు. గతంలో బహిష్కరించబడిన వారిలో కూడా వివిధ రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. అయితే అమృత్‌సర్‌లో విమానాలను ఎందుకు ల్యాండ్ చేస్తున్నారు? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అమెరికా విమానం పంజాబ్‌లో ల్యాండింగ్ కావడంపై ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా తీవ్రంగా విరుచుకు పడ్డారు. ‘ఇలా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌ను అప్రతిష్టపాలు చేయాలనుకుంటోంది’ అని ఆయన అన్నారు. గుజరాత్, హర్యానా లేదా ఢిల్లీలో విమానాన్ని ఎందుకు ల్యాండ్ చేయరు? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *