SBI:

SBI: ఎస్‌బీఐలో మ‌రో తెలుగు వ్య‌క్తికి కీల‌క‌స్థానం.. ఎండీగా రామ‌మోహ‌న్‌రావు నియామ‌కం

SBI:బ్యాంకింగ్ దిగ్గ‌జం ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఎండీగా తెలుగు వ్య‌క్తి అమ‌ర రామ‌మోహ‌న్‌రావు నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని నియామ‌కాల మంత్రి వ‌ర్గం ఉప‌సంఘం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. సంస్థ ప్ర‌స్తుత చైర్మ‌న్ సీఎస్ శెట్టి కూడా తెలుగు వారే. ఎండీగా అమ‌ర రామ‌మోహ‌న్‌రావు బాధ్య‌త‌లు స్వీక‌రిస్తే ఎస్‌బీఐ చ‌రిత్ర‌లో తొలిసారి ఇద్ద‌రు తెలుగు వ్య‌క్తులు బ్యాంక్ టాప్ పోస్టుల్లో ఉండ‌టం విశేషం.

SBI:అమ‌ర రామ‌మోహ‌న్‌రావుది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చీరాల‌. ప్ర‌భుత్వ బ్యాంకులు, కంపెనీల‌కు సార‌ధుల‌ను అన్వేషించే ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ ఇన్‌స్టిట్యూష‌న్స్ బ్యూరో (FSIB) ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నెల‌లోనే స్టేట్ బ్యాంకు డిప్యూటీ ఎండీగా ఉన్న‌ రామమోహ‌న్‌రావు పేరును ఎండీ ప‌ద‌వికి సిఫార‌సు చేసింది. ఇంత‌కు ముందు ఎస్‌బీఐ ఎండీగా ఉన్న సి శ్రీనివాసులు వెట్టి బ్యాంక్ చైర్మ‌న్ నియ‌మితులైన క్ర‌మంలో ఆ పోస్టు ఖాళీ అయింది. ఆ పోస్టులో త్వ‌ర‌లో రామ‌మోహ‌న్‌రావు బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

SBI:ఎస్‌బీఐ బోర్డులో చైర్మ‌న్ స‌హా మొత్తం న‌లుగురు మేనేజింగ్ డైరెక్ట‌ర్లు ఉంటారు. ప్ర‌స్తుతం రామ‌మోహ‌న్‌రావు నాలుగో ఎండీగా నియ‌మితుల‌య్యారు. ఇంజినీరింగ్‌లో ప‌ట్టా పొందిన ఆయ‌న 1991లో విశాఖ‌ప‌ట్నంలో ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌గా ఎస్‌బీఐలో చేరారు. 33 సంవ‌త్స‌రాల పాటు ఎస్‌బీఐలో వివిధ విభాగాల్లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ వ‌చ్చారు. నిరుడు ఆగ‌స్టు వ‌ర‌కు ఎస్‌బీఐ అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ కార్డ్స్ ఎండీ, సీఈవోగా సేవ‌లందించారు. అంత‌కు ముందు ఎస్‌బీఐ భోపాల్ స‌ర్కిల్ సీజీఎంగానూ సేవ‌లందించారు. విదేశాల్లోని బ్యాంకు శాఖ‌ల్లోనూ ఆయ‌న విధులు నిర్వ‌ర్తించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *