Pushpa 2: తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. దానికి సినీతార సహకారాన్ని ఆశిస్తోంది. సినిమా స్టార్స్ తమ చిత్రాల విడుదల సమయంలో ‘డ్రగ్స్ కు దూరంగా ఉండలం’టూ ప్రజలకు తెలియచెప్పాలని ప్రభుత్వం కోరుతోంది. ఇందులో స్టార్స్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే… ఓ వీడియో సందేశం కాకుండా చిన్నపాటి టీజర్ నే రూపొందించి థియేట్రికల్ ప్రదర్శన కోసం ఇచ్చాడు. అంతే… పుష్పరాజ్ మీద తెలంగాణ ప్రభుత్వం ప్రేమ కురిపించేసింది. ‘పుష్ప-2’ టిక్కెట్ ధరలను పెంచుతూ నాలుగు రోజుల ముందే జీవో జారీ చేసింది. బుధవారం రాత్రి నుండే బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో పుష్ప -2 ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అభిమానులు ఆనంద పడుతున్నారు.

