Satya Kumar: ఏపీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి డబ్బు లెక్కిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి వీరేశ్ సత్యకుమార్ స్పందించారు. తిరుపతిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ మద్యం కుంభకోణానికి ముఖ్య సూత్రధారి ఎవరో త్వరలో బయటపడతారని చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మద్యం విక్రయాల ద్వారా వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించిన మంత్రి, “జగన్ అనుచరుడే ఈ ఆర్థిక లావాదేవీలన్నింటిని పర్యవేక్షించాడు. వీడియోలో కనిపించే వ్యక్తి జగన్‌కు అత్యంత సన్నిహితుడే కాదా?” అని ప్రశ్నించారు.
మంత్రి సత్యకుమార్ తీవ్ర విమర్శలు చేస్తూ, “వైసీపీ నేతలు పాపం ఏమీ చేయనట్టు నటిస్తున్నారు. కానీ చట్టం తన పని తాను చేస్తోంది. అవినీతిపరుల్ని ప్రజల ముందు ఆవిష్కరిస్తాం,” అన్నారు.
జగన్‌కు జైలుపై భయం పట్టుకుందని, అందుకే నాటకాలతో ప్రజల సానుభూతిని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. “తనపై తానే దాడులు చేయించుకోవడం, పోలీసులపై విమర్శలు చేయడ,” అని విమర్శలు గుప్పిచారు.
