Parthasarathi: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీ లిక్కర్ స్కాం 10 రెట్లు పెద్దది

Parthasarathi: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ దేశవ్యాప్తంగా మద్యం మార్కెట్‌పై ప్రభావం చూపిందని, ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు తగ్గాయని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కాం గురించి వివరించుతూ, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా 10 రెట్లు పెద్దదని అన్నారు.

పార్థసారథి వెల్లడి ప్రకారం:

సాంకేతిక ఆధారాలతో స్కాం డీటెయిల్స్ బయటపెట్టాం.

కల్తీ మద్యం తాగి 35,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

30 లక్షల మందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి.

వేలాది బినామీల పేర్లతో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయి.

ఈ స్కామ్ ద్వారా వచ్చిన నగదు ఎన్నికల్లో వినియోగించారు.

మంత్రి పార్థసారథి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపేలా ఉన్నాయి. గత ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఇది మరింత బలాన్ని ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *