Sankranthiki Vasthunnam: టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’సినిమాతో 2025 సంక్రాంతి రేస్ లో ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. గతం లో వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సంక్రాంతి కి వచ్చి మంచి విజయం సాధించారు, ఈసారి కూడా అదే సెంటిమెంట్ తో సంక్రాంతికి వస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నాయకానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘గోదారి గట్టుమీద రామ చిలకవే..’అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకి భాస్కరభట్ల లిరిక్స్ అందించగా. రమణగోగుల దీన్ని ఆలపించారు.అయన 18 ఏళ్ల తర్వాత పడిన పాట కావడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. దీనికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.
