Sankranthiki Vasthunam: సంక్రాంతి సందర్భంగా రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడమే కాదు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకు కూడా కాసుల వర్షం కురిపించింది. 303 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి సరికొత్త ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చిన తర్వాత కూడా అనేక రికార్డులు బద్దలు కొడుతోంది. ఓటీటీలో ఈ సినిమాకి ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా వీక్షించేందుకు సబ్స్క్రైబ్ చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ సినిమా కోసం ఒక్క 24 గంటల వ్యవధిలోనే 35,000 మంది సబ్స్క్రైబర్లు జి5కి వచ్చారంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఎంత కనెక్ట్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో జీ5 కి భారీ లాభాలు వచ్చాయి.
