Sangareddy: పంచాయతీ ఎన్నికలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోటీ అయితే చేశాడు కానీ, అనుకున్న నగదు లేక, నిలబెట్టిన నాయకుల ప్రోత్సాహం కరువై మనస్తాపంతో తనువు చాలించాడు. మరో కఠిన విషయం ఏమిటంటే.. ఆత్మహత్య చేసుకున్న ఆ అభ్యర్థి అయ్యప్ప మాలధారణలో ఉండగానే ఈ దుస్పంఘటన చోటుచేసుకోవడం విషాదకరం. వేర్వేరు చోట్ల ఇద్దరు వార్డు అభ్యర్థులు గుండెపోటుతో మృతి చెందారు.
Sangareddy: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన చాల్కి రాజు (36) సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేశాడు. ఎన్నికల ఖర్చులకు సరిపోను డబ్బులు లేవని, పోటీలో నిలబెట్టిన నాయకులే తనకు మద్దతుగా రావడం లేదని మనస్తాపం చెందిన రాజు.. చెట్టుకు టవల్‌తో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Sangareddy: తనకు మద్దతుగా ఎవరూ ప్రచారం చేయడం లేదని, తాను ఓడిపోతానని తమతో చెప్పుకొని రాజు బాధపడ్డాడని తోటి స్వాములు చెప్పారు. అయ్యప్ప సన్నిధానంలోనే ఉంటూ తనను ఒంటరివాడిని చేశారని ఆవేదన వ్యక్తంచేశాడని తెలిపారు. ఆయనతోపాటు సంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మంచర్లగూడ గ్రామంలో పల్లె లత (42), చౌటకూరు మండలం చక్రియాల గ్రామంలో కొత్తొల్ల పద్మారావు (50) గుండెపోటుతో మృతిచెందారు.
