Gold Price Today

Gold Price Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం ధరలు ఈ మధ్యకాలంలో ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు ఒక గ్రాము బంగారం కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. బంగారం, వెండి ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. రోజురోజుకు అవి పరుగులు పెడుతున్నాయి. ఒక రోజు కొద్దిగా తగ్గినా, మరుసటి రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతూ వస్తున్నాయి.

డిసెంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల సమయానికి తులం (10 గ్రాముల) బంగారం ధర ఏకంగా రూ.1,30,430 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు కేవలం ఉదయం ఆరు గంటల వరకు నమోదైనవి మాత్రమే. సాధారణంగా ప్రతి రోజు ఉదయం 10 గంటల సమయంలో మరోసారి ధరలు అప్‌డేట్ అవుతాయి. అప్పుడు ధరలు ఇంకా పెరగవచ్చు, కొద్దిగా తగ్గవచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చు.

ప్రధాన నగరాలలో బంగారం ధరలు (10 గ్రాములు):
దేశంలోని ప్రధాన నగరాలలో 10 గ్రాముల బంగారం ధరలు ఎంత ఉన్నాయో ఇప్పుడు చూద్దాం:

* ముంబై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు: ఈ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,430 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,560 వద్ద ఉన్నాయి.

* ఢిల్లీ: ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,580 గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,710 గా నమోదైంది.

* చెన్నై: ఈ నగరంలో అత్యధికంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,340 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,20,390 వద్ద కొనసాగుతోంది.

వెండి ధర పరిస్థితి
బంగారంతో పాటు వెండి ధర కూడా పెరుగుతూనే ఉంది. దేశీయంగా కిలో వెండి ధర నేడు రూ.1,88,900 వద్ద కొనసాగుతోంది.

బంగారం, వెండి ధరల్లో మార్పులు గమనిస్తే, సామాన్యులకు ఇవి నిజంగా ‘బ్యాడ్‌న్యూస్’ అనే చెప్పాలి. పండుగల సీజన్ లో లేదా శుభకార్యాల సమయంలో కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ అధిక ధరలు భారంగా మారనున్నాయి. ఈ ధరల పెరుగుదలకు ప్రపంచ మార్కెట్లలో వస్తున్న మార్పులు, డాలర్ తో రూపాయి విలువలో హెచ్చుతగ్గులు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *