The Paradise: టాలీవుడ్ లో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది పారడైజ్’ సినిమా పై అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ చిత్రం లో కీలక పాత్రలో కనిపించబోతున్న సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. బిర్యాని పాత్రలో ఆయన టెర్రిఫిక్ లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
Also Read: Aamani: బీజేపీ గూటికి సీనియర్ నటి ఆమని
యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది పారడైజ్’ చిత్రం మాస్ ట్రీట్ మెంట్ తో రూపొందుతోంది. నాని ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే అంచనాలు పెంచిన ఈ సినిమాలో ఇప్పుడు సంపూర్ణేష్ బాబు బిర్యాని పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. రక్తపు చేతులతో గొడ్డలి పట్టుకుని బీడి కాల్చే లుక్ తో ఆయన మాస్ ఇమేజ్ ను చూపిస్తున్నారు. ఈ పోస్టర్ తో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి కీలక పాత్రలో నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. మిగతా పాత్రల లుక్స్ కూడా ఇదే రేంజ్ లో ఉండబోతున్నట్టు కనిపిస్తోంది.
