Sambhal Violence

Sambhal Violence: సంభాల్ హింసాకాండ.. నిరసనకారులను పోలీసుల షాక్

Sambhal Violence: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ హింసాకాండ కేసులో పోలీసులు బుధవారం 100 మంది రాళ్లదాడి చేసిన పోస్టర్‌లను విడుదల చేశారు. వీరిలో చాలా మంది నిందితుల చేతుల్లో రాళ్లు ఉన్నాయి. మరిన్ని వీడియోలు, సీసీటీవీ, డ్రోన్ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వీటి ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని పోస్టర్లు విడుదల చేస్తామని చెప్పారు. అంతేకాకుండా రాళ్లదాడి పాల్పడిన వారి ఫొటోలతో రోడ్లపై పోస్టర్లు, హోర్డింగ్‌లు కూడా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నలుగురు మహిళలతో సహా 27 మందిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేశారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. సంభాల్ పోలీసులు దీపసరాయ్ ప్రాంతంలోని ఫుటేజీని కూడా విడుదల చేశారు. ఇందులో ఒక మహిళ టెర్రస్ పై నుంచి రాళ్లు రువ్వుతూ కనిపించింది.

ఇది కూడా చదవండి: Horoscope: ఈ రాశి వారికి ధనచింత ఉండదు

Sambhal Violence: నవంబర్ 24న సంభాల్‌లోని జామా మసీదు సర్వే సందర్భంగా రాళ్ల దాడి – హింస జరిగింది. ఈ సంఘటనలో నలుగురు  చనిపోయారు. ఈ సందర్భంగా కొన్ని గంటలపాటు రాళ్లదాడి జరిగింది. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. వివిధ చోట్ల పోలీసు బలగాలను మోహరించారు.సంభాల్ హింసకు సంబంధించిన మరో వీడియో బయటపడింది. ఇందులో ఎస్పీ ఎంపీ జియావుర్ రహ్మాన్ బుర్కే ఇంటి సమీపంలోని పైకప్పులపై నుంచి కొందరు మహిళలు పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్నారు.

ఈ సంఘటనలకు సంబంధించి యోగీ సర్కార్ కఠిన వైఖరి తీసుకుంటోంది. రాళ్లదాడిలో పాల్గొన్న వారు పురుషులైనా.. మహిళలైనా వారిని విడిచిపెట్టేది లేదని కమిషనర్ ఆంజనేయ సింగ్ చెప్పారు. అదేవిధంగా ప్రతి వీడియో ఫుటేజ్ జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, దానిద్వారా దోషులను గుర్తిస్తామని యూపీ ఎక్సైజ్ శాఖ సహాయ మంత్రి నితిన్ అగర్వాల్ చెప్పారు. అలా గుర్తించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా అల్లర్ల సందర్భంగా జరిగిన నష్టాన్ని వారి నుంచి వసూలు చేస్తామని మంత్రి చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *